Kadapa: కడప జిల్లా రైతులకు వెంటనే కరువు సాయం ప్రకటించాలి.. ఏవీ రమణ!
Kadapa: కడప జిల్లాలో వర్షాలు లేక పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే కరువు సాయం ప్రకటించాలని రైతు సేవాసమితి జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ డిమాండ్ చేశారు.
Kadapa: కడప జిల్లా రైతులకు వెంటనే కరువు సాయం ప్రకటించాలి.. ఏవీ రమణ!
Kadapa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏలీనానో ప్రభావంతో కడప జిల్లాలో వర్షాలు లేక పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కరువు మండలాలుగా మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం రైతుకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన కరువు సాయం చేసేది ప్రకటించకపోవడం భావ్యం కాదని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు.
ఈరోజు ఉదయం 10 గంటలకు మైదుకూరు పట్టణంలో రైతు సేవాసమితి ఆధ్వర్యంలో మైదుకూరు పట్టణ0లో సమితి మైదుకూరు పట్టణ కార్యదర్శి చెక్ పోస్ట్ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఏవి.రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కరువు మండలాలుగా ప్రకటనకే పరిమితం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా కరువు రైతులకు వెంటనేకరువు సాయం అందజేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే రైతు సేవా సమితి ఆధ్వర్యంలో రైతులు, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని రమణ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవాసమితి నాయకులు, రైతులు రాజాల రామచంద్రుడు, భూమిరెడ్డి మాధవయ్య, మాదం సుబ్బరాయుడు, ముత్తూరు శివ నాగిరెడ్డి, జోషుల పరమేశ్వర్ రెడ్డి, పసల పుల్లయ్య,సమరతస.సుబ్రహ్మణ్యం ,బండి శ్రీనివాసులు, వేడల వీరయ్యతదితరులు పాల్గొన్నారు.




