Badvel: ఆర్డీవో ఆఫీస్‌లో జీడీడీపీ/జీఎండీపీ శిక్షణా కార్యక్రమం!
Badvel: బద్వేల్ ఆర్డీవో కార్యాలయంలో ‘స్వర్ణాంధ్ర @2047’ లక్ష్యాల సాధన కోసం అసెంబ్లీ నియోజకవర్గ ఆర్థిక ప్రొఫైలింగ్ శిక్షణ కార్యక్రమం జరిగింది.
Badvel: ఆర్డీవో ఆఫీస్‌లో జీడీడీపీ/జీఎండీపీ శిక్షణా కార్యక్రమం!
బద్వేల్: గౌరవ జిల్లా కలెక్టర్, వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఆదేశాల మేరకు GDDP/GMDP Capacity Building Training Programme లో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గ ఆర్థిక ప్రొఫైలింగ్ (Constituency Economic Profiling) పై శిక్షణ కార్యక్రమం నేడు బద్వేల్ ఆర్డీవో కార్యాలయం సమావేశ మందిరంలో బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) శ్రీ ఎ. చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీ ఎ. చంద్రమోహన్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర @2047 లక్ష్యాల సాధనలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సమగ్ర ఆర్థిక ప్రొఫైలింగ్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి శాస్త్రీయ ప్రణాళిక రూపొందించవచ్చని తెలిపారు.
ఈ శిక్షణలో జిల్లా కలెక్టరేట్ నుండి వచ్చిన మాస్టర్ ట్రైనర్లు డా. రహీస్ (Dr. Rahees), శ్రీ అర్ఘ్య (Arghya), శ్రీ యశ్వంత్ నాయుడు (Yaswanth Naidu) పాల్గొని నియోజకవర్గ ఆర్థిక ప్రొఫైలింగ్ లక్ష్యాలు, శాఖల వారీ డేటా సేకరణ, ప్రశ్నావళి పూరింపు, డేటా నాణ్యత, విశ్లేషణ, నివేదికల తయారీ, సమన్వయ విధానాలపై అధికారులకు సవివరంగా శిక్షణ అందించారు.
నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో ప్రతి శాఖ అందించే సమాచారం అత్యంత కీలకమని, నిర్ణీత గడువులోగా నాణ్యమైన సమాచారాన్ని సమర్పించాలని ట్రైనర్లు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి (CSO), మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, విద్య, గణాంక, పరిశ్రమలు, పంచాయతీరాజ్, RWS, హౌసింగ్, DWMA, వెలుగు, ఇరిగేషన్, ICDS అధికారులు పాల్గొన్నారు. "CVAP Unit, Badvel Constituency ఆధ్వర్యంలో కార్యక్రమ సమన్వయం జరిగింది".




