Proddatur: ఎగ్జిబిషన్ బకాయిలు తక్షణమే వసూలు చేయాలి: రాచమల్లు డిమాండ్!

Proddatur: ప్రొద్దుటూరు దసరా ఎగ్జిబిషన్ బకాయిలు రూ. 1.63 కోట్లను నిర్వాహకుల నుంచి తక్షణమే వసూలు చేయాలని గురువారం మాజీ ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 19 Nov 2026 8:26 PM IST
Proddatur
X

Proddatur: ఎగ్జిబిషన్ బకాయిలు తక్షణమే వసూలు చేయాలి: రాచమల్లు డిమాండ్!

​ప్రొద్దుటూరు​: ప్రొద్దుటూరు దసరా ఎగ్జిబిషన్‌కు సంబంధించి మున్సిపాలిటీకి రావాల్సిన రూ. 1.63 కోట్ల బకాయిలను నిర్వాహకుల నుంచి తక్షణమే వసూలు చేయాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ప్రొద్దుటూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ అంశంపై పలు ఆరోపణలు చేశారు.

మున్సిపాలిటీకి రావాల్సిన రూ. 1.63 కోట్లలో ఇప్పటివరకు కేవలం రూ. 55 లక్షలు మాత్రమే వసూలయ్యాయని, మిగిలిన మొత్తాన్ని వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పూర్తిస్థాయి బకాయిలు వసూలు చేయకుండానే ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతులు ఎలా ఇచ్చారని రాచమల్లు ప్రశ్నించారు.

ఈ వివాదంలో బాధ్యత వహించాల్సిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ మాజీ ఇన్‌ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు మున్సిపల్ అధికారులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. జిల్లా ఉన్నతాధికారులు, జాయింట్ కలెక్టర్ తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. వెంటనే పూర్తి బకాయిలు వసూలు చేయని పక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR