Proddatur: భారత రాజ్యాంగ గొప్పతనాన్ని గుర్తుచేసుకోవడం మనందరి బాధ్యత: భారతి!

Proddatur: భారత రాజ్యాంగ గొప్పతనాన్ని గుర్తుచేసుకోవడం మనందరి బాధ్యత అని ప్రొద్దుటూరు ఎంపీపీ కొప్పోలు భారతి గురువారం రాజ్యాంగ దినోత్సవంలో అన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 26 Nov 2026 10:01 PM IST
Proddatur
X

Proddatur: భారత రాజ్యాంగ గొప్పతనాన్ని గుర్తుచేసుకోవడం మనందరి బాధ్యత: భారతి!

Proddatur: భారత రాజ్యాంగ గొప్పతనాన్ని గుర్తు చేసుకోవడం మనందరి బాధ్యత అని ప్రొద్దుటూరు ఎంపీపీ కొప్పోలు భారతి పేర్కొన్నారు. గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిబ్బందితో కలిసి రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. ​

ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ.. అంబేద్కర్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. 1949 నవంబర్ 26న ఇది ఆమోదం పొంది, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు.

2015 నుంచి ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమన్నారు. పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో పాటు స్వేచ్ఛ, సమానత్వాన్ని రాజ్యాంగం అందిస్తోందని, ఇది ప్రతి భారతీయుడి జీవన విధానమని అన్నారు. రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సూర్యనారాయణ రెడ్డి, నేతలు మార్తల లక్ష్మిరెడ్డి, మార్తల ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, ప్రతాపరెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR