Rayachoti: మాండవ్య నదిలో ఇసుక అక్రమ రవాణాపై దాడి: 5 ట్రాక్టర్లు సీజ్!

Rayachoti: అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం మాండవ్య నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను సీజ్ చేసిన రెవెన్యూ, పోలీస్ అధికారులు.

Rohith
Published on: 13 Aug 2026 8:50 PM IST
Rayachoti
X

Rayachoti: మాండవ్య నదిలో ఇసుక అక్రమ రవాణాపై దాడి: 5 ట్రాక్టర్లు సీజ్!

రాయచోటి: కడప జిల్లా వీరబల్లి మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతుంది. రాగిమానిదిన్నెపల్లె వద్ద ఉన్న మాండవ్య నది నుంచి నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుక ను దూర ప్రాంతాలకు తరలించి లక్షలల్లో సొమ్ము చేసుకుంటున్నారు.

ఇసుక అక్రమ రవాణాను పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకొని 5 ఇసుక ట్రాక్టర్లు ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుక ట్రాక్టర్లు ను పోలీసులు వీరబల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Rohith

Rohith

Next Story