Badvel: రైతు బజారులో 'రైస్ మార్ట్' ప్రారంభం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం!
Badvel: బద్వేలు మార్కెట్ యార్డు కాంప్లెక్స్‌లో పౌరసరఫరాల శాఖ రైస్ మార్ట్‌ను మంచూరు సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీఓ చంద్రమోహన్ ప్రారంభించారు.
Badvel: రైతు బజారులో 'రైస్ మార్ట్' ప్రారంభం తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం!
Badvel: పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించాలనే ఉద్దేశంతో బద్వేలు పట్టణంలోని మార్కెట్ యార్డు కాంప్లెక్స్‌లో రైస్ మార్ట్‌ను ఏర్పాటు చేశారు.
పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రైస్ మార్ట్‌ను బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి, బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మరియు డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలపై నిత్యావసర వస్తువుల ధరల భారం తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు.
రైస్ మార్ట్ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందిస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండేలా రైస్ మార్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు బియ్యం విక్రయించేలా అధికారులు పర్యవేక్షణ చేస్తారని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైస్ మార్ట్ నిర్వహణపై సంబంధిత అధికారులు నిరంతరం దృష్టి సారించాలని సూచించారు.అనంతరం అధికారులు, కూటమి నాయకులు ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మురళి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




