Kadapa: గాలేరు-నగరిపై మరణ శాసనం.. రాయలసీమకు ద్రోహం చేస్తున్నారా?
Kadapa: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 7 ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో గాలేరు-నగరి లేకపోవడంపై సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మండిపడ్డారు.
Kadapa: గాలేరు-నగరిపై మరణ శాసనం.. రాయలసీమకు ద్రోహం చేస్తున్నారా?
కడప: గాలేరు నగరి ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యం తగదు రాష్ట్రంలో ఏడు ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో గాలేరు నగరి లేకపోవడం చంద్రబాబు వివక్షతకు నిదర్శనం చంద్రబాబు వైఖరి వల్లే రాయలసీమ హక్కులు అవకాశాలు కోల్పోయింది గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడు ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడానికి 11496 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఏడాదిలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించడం వెనక రాయలసీమ ప నిర్లక్ష్యం, గాలేరు నగరి పట్ల చిత్తశుద్ధి లోపం, రాయలసీమ ఎత్తిపోతలపై శాశ్వత మరణ శాసనం కనిపిస్తోందని వైఖరి మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పోలవరం, వెలుగొండ, హంద్రీనీవా, చింతలపూడి, తారకరామా తీర్థ సాగర్ , రాజమహేంద్ర తనయ, హీరా మండలం ఎత్తిపోతల ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించి ఈ ఏడాదిలో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించినట్లు ప్రకటించడం పట్ల తీవ్రంగా ఆక్షేపించారు. హక్కులు అవకాశాలు కోల్పోయి నిత్య కరువులతో తల్లడిల్లుతున్న రాయలసీమ.
ప్రజల జీవనాడి రాయలసీమ ఎత్తిపోతల పథకం గత ప్రభుత్వంలో 80% పనులు పూర్తయి అటు తెలంగాణ ఇటు ఏపీ పాలక ప్రభుత్వాల కుట్రలలో రాయలసీమ ఎత్తిపోతల పథకం బలైందని ఇప్పుడు కూడా ప్రాధాన్యత ప్రాజెక్టుకు దక్కకపోవడం రాయలసీమకు తీవ్ర అన్యాయం అన్నారు, రాయలసీమకు గుండెకాయ లాంటి గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తికి 3000 కోట్లు ఖర్చు చేస్తే రెండో దశ పనులు పూర్తయి రెండు లక్షల 75 వేల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల మందికి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్టు అన్నారు.
అటువంటి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిపోయి ఇదివరకే ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అవుతుందని, మొదటి దశలో ప్రాజెక్టులు పూర్తయి పరిహారం పునరావాసం , పంట కాలువల నిర్మాణం జరగక అదనంగా ఆయకట్టు అభివృద్ధి జరగలేదన్నారు. కృష్ణ నీటిలో నికర జలాలు కలిగి, చారిత్రక నేపథ్యం కలిగిన కేసీ కెనాల్ చివరాయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించిన రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి ఈ ఏడాది కూడా ఉండి చేయి చూపించడం విచారకరమన్నారు.
లక్షల ఎకరాల ఐకట్టు, ఐదు ఆరు జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చే రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేతయించకుండా నిర్లక్ష్యం చేస్తూ తీవ్ర అన్యాయానికి ఒడిగట్టిన చంద్రబాబు పై రాయలసీమ ప్రాంతం నుండి ఎన్నికైన కూటమి ప్రజాప్రతినిధులు ప్రశ్నించాలడి లేకపోతే రాయలసీమ మరోసారి తీవ్రంగా కరువు అసలు ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరించారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేసి బాధల్లా, పి బాలు కే మునయ్య నాగేశ్వరరావు షావలి తదితరులు పాల్గొన్నారు.




