Rayachoti: రాయచోటికి రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరు!

Rayachoti: రాయచోటి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రూ. 23.75 కోట్లతో 50 పడకల అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరైంది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 31 July 2026 11:41 AM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటికి రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరు!

Rayachoti: రాయచోటి ప్రజలకు మెరుగైన, ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేక చొరవ తీసుకుని, వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన నిధులను సాధించారు.

రూ.23.75 కోట్లతో 50 పడకల అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్

రాయచోటికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో 50 పడకల అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరైంది. ఈ ప్రాజెక్టు రాయచోటి వైద్యరంగ చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుంది.

ఇప్పటికే ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రికి అనుబంధంగా నిర్మించనున్న ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అత్యవసర వైద్య సేవలకు కేంద్ర బిందువుగా మారనుంది. రోడ్డు ప్రమాదాలు, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులు, తీవ్రమైన గాయాలు, ఇతర క్లిష్ట ఆరోగ్య సమస్యల్లో సత్వర చికిత్స అందించేందుకు ప్రత్యేక వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఐసీయూ సదుపాయాలు, ఆధునిక ప్రయోగశాలలు, అత్యాధునిక వైద్య పరికరాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

రాయచోటి–కడప, రాయచోటి–మదనపల్లె, రాయచోటి–వేంపల్లి ప్రధాన రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ వేలాది కుటుంబాలకు ప్రాణరక్షణ కేంద్రంగా మారనుంది. ఇప్పటి వరకు అత్యవసర చికిత్స కోసం కడప, తిరుపతి, బెంగళూరు వంటి ఇతర ప్రాంతాలకు రోగులను తరలించాల్సిన పరిస్థితికి ఈ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం లభిస్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు..

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story