Mydukur: కేసీ, తెలుగుగంగ రైతు కుటుంబానికి రూ.30 వేలు ఇవ్వాలి: రైతు సేవా సమితి!

Mydukur: ఎల్ నినో ప్రభావంతో సాగునీరు అందక నష్టపోతున్న కేసీ కెనాల్, తెలుగుగంగ రైతు కుటుంబాలకు రూ.30 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ డిమాండ్ చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 28 Aug 2026 8:47 PM IST
Mydukur
X

Mydukur: కేసీ, తెలుగుగంగ రైతు కుటుంబానికి రూ.30 వేలు ఇవ్వాలి: రైతు సేవా సమితి!

మైదుకూరు: రాష్ట్రంలో ఎలినవోప్రభావంతో ఈ ఖరీఫ్ సీజన్లో కేసీ. కెనాల్ రైతుకు వరికి ,ఆరుతడి పంటలకు కూడానీరు ఇవ్వమని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వర్షం లేని దానివల్ల రైతుకు ఆరుతడి పంట కూడా అవకాశం లేనందున కేసీ. రైతు కుటుంబానికి 30 వేల రూపాయల వంతున ఇవ్వాలని రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటే తేదీ నుంచి జరిగే గ్రామబాటలో ప్రతి రైతు భాగస్వామి హై కార్యక్రమం జయప్రదం చేయాలని రైతు సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మైదుకూరులో కరపత్రం విడుదల చేయడం జరిగిందని రైతు సేవాసమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ అన్నారు.

అలాగే భవిష్యత్తులో పకృతి వైపరీత్యాలను ఎదుర్కొని రైతు పంట పండించుకోవాలంటే కడప జిల్లా కేసి.కెనాల్ రైతుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి పూర్తిచేయాలని కోరారు. అలాగే 22 సంవత్సరాలుగా కడప జిల్లాలో తెలుగు గంగ ప్రాజెక్టులో నీరు ఉన్న పంట, పిల్ల కాలవలు లేని కారణంగా ఆయకట్టురైతుకు నీరందడం లేదని పంట, పిల్ల, కాలువలు పూర్తికి కూడా నిధులు కేటాయించి పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని రమణ కోరారు.

రైతులు ఎదుర్కొంటున్న పై మూడు సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ ఒకటవ తేదీ చాపాడు మండల లోని గ్రామాలనునుండి జరుగుతున్న రైతు సేవా సమితి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగే రైతు గ్రామబాట కార్యక్రమంలో భాగస్వాములై సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని రైతులను, కడప జిల్లా రైతు సేవాసమితి కోరుతున్నదనీ రమణ తెలిపారు.

ఈరోజు కరపత్ర విడుదల కార్యక్రమంలో రైతు సేవాసమితి మైదుకూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రామ్మోహన్, శ్రీనివాసులు, రైతులు సమరతస సుబ్రహ్మణ్యం, రాజాల రామ చంద్రుడు, భూమిరెడ్డి చిన్న మాధవయ్య, సుబ్బయ్య, జిబి.సిద్దయ్య రిటైర్డ్ ఆర్టిసి, తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story