Mydukur: దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్!
Mydukur: మైదుకూరు మున్సిపాలిటీలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా తక్షణమే దోమల నివారణ చర్యలు చేపట్టాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ డిమాండ్ చేశారు.
Mydukur: దోమల నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్!
Mydukur: మైదుకూరు మున్సిపాలిటీ లోని పట్టణ మరియు గ్రామాల ప్రజలు డెంగ్యూ , మలేరియావంటి విష వ్యాధులకు గురికాకముందే దోమలు, చీటీ గల నివారణకు మున్సిపల్ అధికారులు వెంటనే ప్యాకింగ్ చర్యలు చేపట్టాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ సమితి మైదుకూరు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కానగూడూరు రామ్మోహన్, చెక్ పోస్ట్ శ్రీనివాసులతో కలిసి మైదుకూరు మున్సిపల్ అధికారులను కోరారు.
రమణ మాట్లాడుతూ మైదుకూరు పట్టణంలోని డివిజన్లలో, గ్రామాలలో మురికి నీరు ,డ్రైనేజీనీరు నివాసాల మధ్యలోనే నిలువ ఉండడంతో ప్రజలకు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటలకు దోమలకు భయపడి నివాసముల నుండి రాత్రిపూట బయట తిరగాలంటేనే కష్టంగా ఉందని వెంటనే మున్సిపల్ అధికారులు దోమలు, చీటిగల నివారణకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులు స్పందించకపోతే రైతు సేవాసమితి ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన మైదుకూరు పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి మైదుకూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామనిఏవి.రమణ మున్సిపల్ అధికారులకు తెలియజేశారు.




