Kadapa: కేసీ కెనాల్ ఆయకట్టుకు ఆరుతడి పంటల నీరు ఇవ్వాలి ఏవీ రమణ డిమాండ్!

Kadapa: కడప జిల్లా కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ డివిజనల్ కార్యాలయం ఎదుట రైతు సేవా సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 14 Aug 2026 2:13 PM IST
Kadapa
X

Kadapa: కేసీ కెనాల్ ఆయకట్టుకు ఆరుతడి పంటల నీరు ఇవ్వాలి ఏవీ రమణ డిమాండ్!

Kadapa: కడప జిల్లా కేసీ.కెనాల్ ఆయకట్టు రైతులకు ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని కడప జిల్లా రైతు సేవాసమితి ఆధ్వర్యంలో ఈరోజు మైదుకూరు లోని కే సి.కెనాల్ డివిజనల్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసినిరసన తెలియజేసి అనంతరం డిఈ. పుల్లయ్య గారికి వినతి పత్రం అందజేసినట్టు రైతు సేవాసమితి జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ తెలిపారు.

రమణ మాట్లాడుతూ శ్రీశైలం డ్యాం లో ఎనిమిది వందల అడుగులు నీరు ఉన్నందున వరిపంటకి ఇవ్వకపోయినా అయకట్టు రైతులకు ఉపాధి ఈ పొలాలు అయినందున కచ్చితంగా ఆ యకట్టు రైతులకు నీరు ఇవ్వాల్సిందేనని కెసికెనాల్ అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని రమణ కోరారు .

ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రమణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడిశెట్టి సహదేవుడు, సమితి మైదుకూరు పట్టణ నాయకుడు రామ్మోహన్, సుబ్బరాయుడు, గోసెట్టి రమణయ్య, యల్లల రామచంద్రుడు, ములపాకు నాగేశ్వరరెడ్డి, రాయని రామకృష్ణ, గురువిరెడ్డి, శివ నాగిరెడ్డి, చెన్నారెడ్డి, ముత్తులూరుపాడు శీను, రైతులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story