Mydukur: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించిన రైతు సేవాసమితి!

Mydukur: కడప జిల్లా మైదుకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రైతు సేవాసమితి జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 1 Oct 2026 2:09 PM IST
Mydukur
X

Mydukur: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించిన రైతు సేవాసమితి!

Mydukur: తమిళనాడు రాష్ట్రం నుండి అభివృద్ధిలో వెనుకబడిన తెలుగు ప్రాంతాల అభివృద్ధి కోసం జరిగిన పోరాటంలో అమరుడైన పొట్టి శ్రీరాములు గారిని 1953 వ సంవత్సరం అక్టోబర్1 ఒకటవ తేదీ కర్నూల్ రాజధానిగా శ్రీబాగ్ ఒడంబడిక చట్టంతో అభివృద్ధి ఈ కేంద్రీకరణలో భాగంగా గుంటూరులో హైకోర్టు, విశాఖలో ఉక్కు పరిశ్రమ, రాజమండ్రిలో విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే విధానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్స వాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప జిల్లాలోని మైదుకూరు పట్టణం మార్కెట్ సర్కిల్ లోని అమరజీవిపొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో రైతు సేవా సమితి నాయకత్వం పూలమాలయసి గౌరవించడం జరిగిందని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏవి.రమణ మాట్లాడుతూ రాష్ట్రం రాయలసీమ అభివృద్ధి కోసం ఏర్పడిన మూడు సంవత్సరాల లోనే 1956 వ సంవత్సరం నుండే రాయలసీమకు మళ్ళీ అన్యాయం మొదలైందని హైదరాబాదును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కేంద్రీకరించుకొని హైదరాబాద్ అభివృద్ధి కోసమే పాటుపడడం జరిగిందని, అటు తర్వాత మళ్లీ తెలంగాణ విడిపోయిన తర్వాత కేవలం 29 గ్రామాల అభివృద్ధి కోసమే అమరావతి పేరుతో మరొకసారి అభివృద్ధి కేంద్రీకరణ చేస్తూ ముఖ్య మంత్రులు రాయలసీమ వాసులైన రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కి నిధులు, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయింపులో అన్యాయం చేస్తున్నారని ఏ వి.రమణ అన్నారు.

ఇప్పటికైనా రాయలసీమ రైతులు, యువకులు, విద్యార్థులు రాయలసీమ ఉద్యమానికి సిద్ధం కావాలని ఏ వి.రమణ కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్ మూలే రామకృష్ణారెడ్డి, సమితి మైదుకూరు మండల కార్యదర్శి తిరువాయి పాటి నరసింహులు, సమితి పట్టణ కార్యదర్శి చెక్పోస్ట్ శ్రీనివాసులు, రైతులు సంగటి తిమ్మాయి పల్లె వెంకటసుబ్బయ్య, ముత్తులూరుపాడు వెంకట్రాముడు, దాశర రెడ్డి గారి సుబ్బరాయుడు, గుర్రం ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR