Mydukur: కేసీ కెనాల్ రైతులకు తక్షణమే సాగునీరు ఇవ్వాలి: రైతు సేవా సమితి!
Mydukur: కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇవ్వాలని, లేనిపక్షంలో ఎకరాకు రూ.30 వేలు చెల్లించాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Mydukur: కేసీ కెనాల్ రైతులకు తక్షణమే సాగునీరు ఇవ్వాలి: రైతు సేవా సమితి!
మైదుకూరు: కడప జిల్లా కేసీ.కెనాల్ రైతుకు నీరు ఇవ్వాలనీ రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి.రమణరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సేవా సమితి గ్రామబాట రెండో రోజు కార్యక్రమం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకుచాపాడు మండలం అల్లాడుపల్లె గ్రామ రైతులతో జరిగినది.
ఈ సమావేశంలో ఏవి.రమణ మాట్లాడుతూ 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కేసీ.కెనాల్ రైతుకు అధికారికంగా ఏపంటకు నీరు ఇవ్వమని ప్రకటించడం దారణమని కడప జిల్లా కేసీ. కెనాల్ రైతుకు మూడు టీఎంసీలు నీరైతే కడప జిల్లా కేసీ.కెనాల్ఆయకట్టు రైతులందరికీ కూడా సరిపోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మొన్నటి రోజు మార్కాపురం జిల్లావెలుగొండ కెళ్ళి ఈ సంవత్సరం నూతన నల్లమల్ల సాగర్ ద్వారా10 టీఎంసీల ఇస్తున్నామని చెప్పి బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని ప్రకటించడం చూస్తే రాయలసీమ రైతుకు జరుగుతున్న అన్యాయం రైతులందరూ కూడా గుర్తించాలని రమణ రైతులను కోరారు.
కేసి. కెనాల్ రైతుకు నీరు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందున ప్రతి కేసి. కెనాల్ ఆయకట్టు రైతుకి ఈ సంవత్సరం జీవనం కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం30 వేల రూపాయలు ఇవ్వాలని రమణ డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో కడప జిల్లాకేసి. కెనాల్ రైతుకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే రాజోలి 2.95 ప్రాజెక్టుకు, జోలదరాశి 1. టీఎంసీ ప్రాజెక్టు లకునిధులు కేటాయించి పూర్తిచేయాలని రమణ కోరారు.
రాయలసీమ రైతులకు ఎలిననో పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తా ఉంటే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పై స్పందించకపోవడం మరింత దారుణమని రమణ అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రాయలసీమకు జరుగుతున్న అన్యాయం పైన స్పందించాలని తమ విధానమేమిటో తెలపాలని రమణ కోరారు.
ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి చాపాడు మండల అధ్యక్షుడు మూలే నాగేశ్వర్ రెడ్డి, రైతు రిటైర్డ్ ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి , మూలె రామాంజనేయరెడ్డి, అల్లాడు పల్లెగ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ కిషోర్ రెడ్డి, రైతులువీరారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, రామ చంద్రారెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.




