Sambepalli: విద్యుత్ షాక్ బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత

Sambepalli: సంబేపల్లి మండలంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును అందజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 5 Sept 2026 4:23 PM IST
Sambepalli
X

Sambepalli: విద్యుత్ షాక్ బాధితులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత

సంబేపల్లి: సంబేపల్లి మండలంలో ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన కుటుంబానికి రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అండగా నిలిచారు. ఘటనపై స్పందించిన మంత్రి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బాధిత కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి గారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవిగారి తో కలిసి అందజేశారు. కష్టకాలంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మంత్రి తెలిపారు.

బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే హామీని కూడా త్వరితగతిన అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రజల కష్టాల్లో వారికి తోడుగా నిలిచి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story