Rayachoti: రాయచోటి ఆలయంలో విఘ్నేశ్వరునికి సంకష్టహర చతుర్థి పూజలు!

Rayachoti: రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో విఘ్నేశ్వరునికి ఘనంగా సంకష్టహర చతుర్థి పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయం తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Sept 2026 11:37 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి ఆలయంలో విఘ్నేశ్వరునికి సంకష్టహర చతుర్థి పూజలు!

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణము యందు వెలసిన శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం నందు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి సంకష్టహర చతుర్థి పూజలు నిర్వహించడం జరిగినది. ఈ పూజలో పాల్గొన్న భక్తాదులు భక్తి శ్రద్దలతో విశేష పూజలు, అర్చనలు చేసినారు.

పూజలు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ చైర్మన్ శ్రీ తిరుమల మనోజ్ కుమార్ గారు మరియు పాలక మండలి సభ్యులతో పాటు ఆలయ సహాయ కమిషనరు శ్రీ డి.వి. రమణారెడ్డి గారు తెలియజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI