Sundupalli: 32 రకాల నిబంధనలు.. స్కూల్ బస్సుల్లో ఇవి లేకపోతే బండి సీజ్!
Sundupalli: అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో స్కూల్ బస్సుల తనిఖీ. 32 రకాల భద్రతా నియమాలు పాటించాలని ఎంవీఐ అజయ్ కుమార్ ఆదేశం.
Sundupalli: 32 రకాల నిబంధనలు.. స్కూల్ బస్సుల్లో ఇవి లేకపోతే బండి సీజ్!
సుండుపల్లె: ప్రతి స్కూల్ బస్సుకు భద్రత నియమాలు తప్పనిసరి 60 ఏళ్లలోపు వయసుతోపాటు ఐదు సంవత్సరాలు అనుభవంతో కూడిన హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారే స్కూల్ బస్సులు డ్రైవింగ్ చేయాలి. విద్యార్థులు సురక్షితంగా ప్రయాణించడానికి మోటార్ అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్, అన్నమయ్య జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు సుండుపల్లి మండలంలో స్కూల్ బస్సులు తనిఖీలు వాటి కావలసిన భద్రత నియమాలపై అవగాహన మీడియాతో వెల్లడించిన ఎం వి ఐ అజయ్ కుమార్.
ఈ ఏడాది స్కూల్లో ప్రారంభమయ్యే లోపల స్కూల్ బస్సులు అన్ని రకాల భద్రత నియమాలు పాటించాలని ప్రవేట్ స్కూల్ కాలేజ్ యాజమాన్యాలకు సూచించారు రాయచోటి ఎం.వి.ఐ అజయ్ కుమార్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్, అన్నమయ్య జిల్లా రవాణా శాఖ అధికారి ఆదేశాల మేరకు సుండుపల్లి మండలంలోని పలు పాఠశాల కాలేజ్ బస్సుల భద్రత నియమాలను పరిశీలించినట్లు అజయ్ మీడియా ద్వారా తెలియజేశారు.ఈ సందర్భంగా మోటారు వాహనాల చట్టాలను ప్రతి పాఠశాల యాజమాన్యాలు పాటించాలని వారికి సూచించారు.
32 రకాల భద్రత నియమాల గురించి వారికి అవగాహన కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. సుండుపల్లి మండలంలో సుమారు 22 పైగా కాలేజ్, స్కూల్ బస్సులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ ఏడాది స్కూల్స్,కాలేజీలు ప్రారంభమయ్య లోపల బస్సులకు అన్ని రకాల భద్రత నియమాలు ఉండేటట్లు చూసుకోవాలని తెలియజేసామన్నారు. భద్రత నియమాలు పాటించని స్కూల్ యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందన్నారు.
ఇటీవల కాలంలో స్కూల్ బస్సులు అనేక ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నామన్నారు. అటువంటి సమస్యలు లేకుండా విద్యార్థులు సురక్షితంగా ప్రయాణించేందుకు ట్రాన్స్ఫర్ అధికారులు కఠినమైనటువంటి చర్యలు అమలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. స్కూల్ యాజమాన్యాలు డ్రైవర్ తో పాటు అటెండర్ కూడా తప్పకుండా నియమించుకోవాలన్నారు. అన్ని రకాల రికార్డులు తప్పనిసరిగా బస్సులో పెట్టుకొని ఎక్కడైనా పోలీసు రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు వారికి చూపించాల్సిన బాధ్యత ఉందన్నారు.




