Badvel: బద్వేల్ నియోజకవర్గంలో 30 యాక్ట్, 163 బీఎన్ఎస్ఎస్ అమలు!

Badvel: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గం మొత్తం 30 పోలీస్ యాక్ట్, 163 బీఎన్ఎస్ఎస్ అమలులో ఉంటాయని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 14 Nov 2026 8:17 PM IST
Badvel
X

Badvel: బద్వేల్ నియోజకవర్గంలో 30 యాక్ట్, 163 బీఎన్ఎస్ఎస్ అమలు!

కడప జిల్లా, బద్వేల్: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్ లో మైదుకూరు డివిజనల్ అధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రేపటి నుంచి గ్రామపంచాయతీ నామినేషన్ల కార్యక్రమం మూడు రోజులపాటు ఉంటుందని, ఈ సందర్భంగా నియోజకవర్గ మొత్తం 30 పోలీస్ యాక్ట్ మరియు 163 బి ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ కూడా అమలులో ఉంటుందని దీని ప్రకారం ఏ ప్రాంతంలో కూడా ఐదు మంది కంటే వ్యక్తులు గుమి కూడకూడదని అలా గుమి కూడినట్లయితే వారి పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలియజేశారు.

నామినేషన్లు వేయడానికి వచ్చే వ్యక్తులను ఇతర వ్యక్తులు ఎవరు ఇబ్బంది పెట్టకూడదని అలా ఇబ్బంది పెట్టిన పక్షంలో వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయని, ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో వాళ్లంతా స్వేచ్ఛ వాతావరణం లో నామినేషన్ వేసే అవకాశం కల్పించబడుతుందని తెలియజేశారు.

ఈ సందర్భంగా రూరల్ మరియు అర్బన్ సిఐలు ఎస్సైలు పోలీసులు వారి సమక్షంలో అభ్యర్థులకు రక్షణ కల్పించబడుతుందని చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసినట్లయితే కఠినమైన చర్యలు ఉంటాయని నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL