Porumamilla: పోరుమామిళ్ల సర్పంచ్ బరిలో షేక్ సునేహా!

Porumamilla: వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి వర్గం నుంచి షేక్ సునేహా బరిలో నిలుస్తున్నట్లు సమాచారం.

P Upendra, Kadapa Porumamilla
Published on: 20 Oct 2026 7:59 AM IST
Porumamilla
X

Porumamilla: పోరుమామిళ్ల సర్పంచ్ బరిలో షేక్ సునేహా!

Porumamilla: పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో పోరుమామిళ్ల పట్టణానికి చెందిన షేక్ అస్గర్ బాషా (అల్లా) కుమార్తె షేక్ సునేహా ఉన్నట్లు సమాచారం. బద్వేల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అధినపు సమన్వయకర్త సల్లేరు విశ్వనాథ్ రెడ్డి వర్గం నుంచి సర్పంచ్ బరిలో దిగుతున్నారు.

సునేహా ఉన్నత విద్యావంతురాలు, ఎంఎస్సీ బయో టెక్నాలజీ చేశారు. ఈమెది రాజకీయ నేపథ్యం కల్గిన కుటుంబం. తండ్రి షేక్ అస్గర్ బాషా (అల్లా) గతంలో పోరుమామిళ్ల మండల కో- ఆప్షన్ మెంబర్ గా తల్లి షమీం వార్డు మెంబర్ గా పనిచేశారు. గత 40 సంవత్సరాల నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి విధేయులుగా మెలుగుతూ పోరుమామిళ్ల మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

P Upendra, Kadapa Porumamilla

P Upendra, Kadapa Porumamilla