Somala: రాంచరణ్ మృతి: నిందితుడి కోసం పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ధర్నా!
Somala: సోమలలో రోడ్డు ప్రమాదంలో రాంచరణ్ మృతి. నిందితుడిని అరెస్ట్ చేయాలని మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద కుటుంబ సభ్యుల ధర్నా.
Somala: రాంచరణ్ మృతి: నిందితుడి కోసం పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ధర్నా!
Somala: రోడ్డు ప్రమాదంలో రాంపల్లి దళితవాడకు చెందిన యువకుడు మృతి చెందడంతో నిందితులపై చర్యలు తీసుకోవాలని శవాన్ని రోడ్డుపై ఉంచి బుధవారం రాత్రి 8 గంటల నుంచి రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో 14 గంటలుగా ప్రయాణికులు నిద్రాహారాలు మాని రోడ్డుపైనే అవస్థలు పడుతున్నారు. పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు ఆస్పత్రికి వెళ్లాల్సిన రోగులు ఇలా రకరకాల వ్యక్తులు బాధలు పడుతున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు నిస్సహాయంగా చూస్తూ ఉన్నారే తప్పించి ప్రజలను అవస్థల నుంచి కాపాడలేక పోతున్నారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రజలకు భద్రత కల్పించలేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
Next Story




