Rayachoti: ప్రశాంతంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలి: అన్నమయ్య ఎస్పీ!

Rayachoti: అన్నమయ్య జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు మండపాలను సందర్శించి భద్రతా చర్యలను పరిశీలించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 14 Sept 2026 9:28 PM IST
Rayachoti
X

Rayachoti: ప్రశాంతంగా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలి: అన్నమయ్య ఎస్పీ!

రాయచోటి: అన్నమయ్య జిల్లాలో ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారి ఆదేశాల మేరకు, సోమవారం జిల్లాలో పోలీసు అధికారులు పలు గణేష్ మండపాలను సందర్శించారు. పండుగను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు.

మండపాల వద్ద విద్యుత్ భద్రత కచ్చితంగా పాటించాలని, ఎల్లప్పుడూ వాలంటీర్లు కాపలా ఉండాలని స్పష్టం చేశారు. ఉత్సవాలు శాంతియుతంగా ముగిసేలా పోలీసులకు సహకరిస్తూ, ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI