Kadapa: PGRS ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: కడప ఎస్పీ!

Kadapa: పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) లో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని 142 అర్జీలను స్వీకరించారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 10 Aug 2026 11:02 PM IST
Kadapa
X

Kadapa: PGRS ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి: కడప ఎస్పీ!

కడప: వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 142 ఫిర్యాదులు PGRS కు వచ్చాయి. ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

ఎస్పీ గారు పేర్కొన్న ముఖ్య అంశాలు..

* పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.

* ప్రజల నుండి అందిన సదరు ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరిస్తాం.

ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు తమ వినతులను విన్నవించుకున్నారు. వాటిపై సంబంధిత పోలీస్ అధికారులతో జిల్లా ఎస్.పి గారు నేరుగా మాట్లాడి సమస్యను చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు.

కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ ) శ్రీ కె. ప్రకాష్ బాబు గారు, స్పెషల్ బ్రాంచ్ డి. ఎస్పీ శ్రీ ఎన్. సుధాకర్ గారు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story