Annamayya: బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని చౌడేపల్లిలో ప్రత్యేక పూజలు

Annamayya: చౌడేపల్లి మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, అఖండ దీపారాధన నిర్వహించిన అభిమానులు.

MAHESH, PUNGANOOR
Published on: 27 July 2026 4:50 PM IST
Annamayya
X

Annamayya: బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని చౌడేపల్లిలో ప్రత్యేక పూజలు

అన్నమయ్య జిల్లా: పుంగనూరు నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తొందరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

చౌడేపల్లి పట్టణంలో వెలసివున్న, దక్షిణ భారతదేశంలోనే ఏకశిలా ద్వజస్థంభం కలిగిన ఏకైక దేవస్థానం శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి దేవస్థానం

ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడ 11,22,44 రోజులు ఎవరైతే అనారోగ్యం తో బాధపడుచున్నారో వారి పేరున అఖండ ధీపారాధన చేయిస్తారో వారు వెటనే కోలుకుంటారని భక్తుల నమ్మకం

ఈ మద్య కాకినాడ లో సినిమా షూటింగ్ లో నటుడు నందమూరి బాలకృష్ణ గాయపడటం జరిగింది.

ఆయన త్వరగా కోలుకోవాలని ఆలయ విశిష్టతను తెలుసుకున్న నందమూరి బసవ తారకం సేవా ట్రస్ట్ కర్ణాటక, నందమూరి తారకరామారావు పేదల బడుగు సేవా ట్రస్ట్ పుంగనూరు వారి ఆద్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నటుడు బాలకృష్ణ తొందరగా కోలుకోవాన్నారు.

44 రోజులు అఖండ దీపారాధన ముగింపు రోజున బాలకృష్ణ సతిమణి హాజరౌతారని తెలియజేశారు.

ఈకార్యక్రమంలో సదరు ట్రస్ట అధ్యక్షులు బాలకృష్ణ, అప్పిరెడ్డి, స్థానిక తెలుగుదేశం నాయకులు బోయకొడ సుబ్బు,ప్రబాకర, కళ్యాణ్, కుమార్ రెడ్డి పాల్గొన్నారు

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story