Rayachoti: లక్ష్మీపురంలో సుగవాసి ప్రసాద్ బాబుకు ప్రత్యేక పూజలు
Rayachoti: గాలివీడు జడ్పీటీసీగా రికార్డు మెజార్టీతో గెలిచిన సుగవాసి ప్రసాద్ బాబు విజయాన్ని పురస్కరించుకుని రాయచోటి లక్ష్మీపురంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
Rayachoti: లక్ష్మీపురంలో సుగవాసి ప్రసాద్ బాబుకు ప్రత్యేక పూజలు
రాయచోటి: ఆదివారం ఉదయం రాయచోటి పట్టణంలోని లక్ష్మీపురం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో కాలనీవాసుల కోరిక మేరకు గాలివీడు జడ్పీటీసీగా ఘన విజయం సాధించిన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి విజయాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపించి, స్వామివారి తీర్థప్రసాదాలను సుగవాసి ప్రసాద్ బాబు గారికి అందజేశారు.
స్వామివారి ఆశీస్సులతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అన్నమయ్య జిల్లా, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కాలనీవాసులు, అభిమానులు ఆకాంక్షించారు.




