Kadapa: జమ్మలమడుగులో కన్నుల పండుగగా నారాపుర స్వామి కళ్యాణం!

Kadapa: జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 7 May 2026 11:45 AM IST
Kadapa
X

Kadapa: జమ్మలమడుగులో కన్నుల పండుగగా నారాపుర స్వామి కళ్యాణం!

కడప జిల్లా: జమ్మలమడుగులో కొలువైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తి పారవశ్యంలో ఘనంగా జరిగింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ దివ్య కార్యక్రమం రాత్రి 8 గంటల వరకు వైభవంగా కొనసాగింది. జమ్మలమడుగు ప్రజలకు కొంగు బంగారమైన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గత నెల ఏప్రిల్ 30వ తేదీ నుంచి ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవాన్ని పూజారులు వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ దివ్య ఘట్టాన్ని తిలకించేందుకు మునుపెన్నడూ లేనివిధంగా భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు పెద్ద పెద్ద డిజిటల్ తెరలను ఏర్పాటు చేసి, అందరికీ కళ్యాణం ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సతీమణి అరుణమ్మ, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి హాజరయ్యారు. కళ్యాణోత్సవం అనంతరం వారికి ఆలయ పూజారులు, టీటీడీ అధికారులు ఘనంగా సత్కరించారు. స్వామివారి తలంబ్రాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU