Veeraballi: కడప జిల్లాలో యల్లమ్మ జాతర కోలాహలం.. 19న నిండు తిరుణాల
Veeraballi: వైఎస్ఆర్ కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామంలో శ్రీ యల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
Veeraballi: కడప జిల్లాలో యల్లమ్మ జాతర కోలాహలం.. 19న నిండు తిరుణాల
వీరబల్లి: కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామంలో శ్రీ యల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాలు నేటి నుంచి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జాతర ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు, జాతర నిర్వాహకులు ఎంతో భక్తిశ్రద్ధలతో గ్రామోత్సవం నిర్వహించారు.
ఉప్పరపల్లె నుంచి ప్రారంభమైన అమ్మవారి గ్రామోత్సవం వంగిమల్ల, దిగువరాచపల్లి గ్రామాలలో కొనసాగింది. డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య కోలాహలంగా అమ్మవారి గ్రామోత్సవం జరిగింది. గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. 19వ తేదీ మంగళవారం నిండు తిరుణాల, 20వ తేదీ మైలు తిరుణాల తో జాతర ముగుస్తుందని జాతర నిర్వాహకులు తెలిపారు.
Next Story




