Rayachoti: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి శ్రీకాంత్ రెడ్డి!
Rayachoti: జగన్ హయాంలో 'నాడు-నేడు'తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారాయని, విద్యను వ్యాపారంగా మార్చకుండా పేదలకు హక్కుగా అందించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Rayachoti: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి శ్రీకాంత్ రెడ్డి!
Rayachoti: సామాన్యుడికి ప్రభుత్వం అందించాల్సిన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత విద్య అని, పేద, మధ్యతరగతి,దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో గత జగన్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో అనేక కీలక మార్పులు తీసుకొచ్చిందని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
పేద పిల్లలకు నాణ్యమైన విద్య అంధించడం ద్వారా వారి భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాకుండా,అది రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడిగా మారుతుందని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలంగా విశ్వసించారన్నారు.
మన రాష్ట్రంలో కోట్లాది మంది కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని, ఆ కుటుంబాలకు రేషన్ కార్డు ఇచ్చి ప్రభుత్వం నిర్దారించిందని,ఆ నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ విద్యపై ఆధారపడి ఉంటారన్నారు.ఆ కుటుంబాల పిల్లలు ప్రయివేట్ విద్యాసంస్థలలో లక్షలకు లక్షలు డోనేషన్లు కట్టలేని పరిస్థితులు న్నాయన్నారు.
మహోన్నత లక్ష్యంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలను, అంగన్ వాడీలను సైతం నాడు– నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడం, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్, టేబుల్స్, కుర్చీలు, తాగునీటి సదుపాయాలు, విద్యార్థి వేసుకునే యూనిఫారం, షూస్, టై వంటివి అందచేయడం, పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూను రూపొందించి అమలుచేయడం జరిగిందన్నారు.
కార్పోరేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఎందుకు?
నారాయణ, చైతన్య, భాష్యం తదితర కార్పొరేట్ పాఠశాలలే అభివృద్దే తమ విధానమని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. కనీస అర్హత ప్రమాణాలు లేకుండానే మంత్రిగా కొనసాగుతున్న నారాయణ కు చెందుతున్న విద్యాసంస్థలకు ఎక్కడపడితే అక్కడ అనుమతులు ఇస్తున్నారని, చైతన్య విద్యాసంస్థల వారు అధికార పార్టీకి వందల కోట్ల రూపాయలను వాటాలా రూపంలో పార్టీకి నిధులు సమకూరుస్తోందని,రాజ్యసభ సభ్యుడికి చెందిన
భాష్యం విద్యాసంస్థల అభివృద్ధికే ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ప్రభుత్వ పాఠశాలకు వ్యతిరేఖంగా విద్యను వ్యాపారంగా మార్చుతోందన్నారు. అలా కాకుండా గతంలో జగన్ ప్రభుత్వం సామాన్య విద్యార్థికి అందుబాటులోకి డిజిటల్ క్లాస్ లను ఏర్పాటు చేయడం, ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
బాలికల విద్యాభివృద్ధికి పెద్దపీట
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తేవాలని ప్రతి మండలంలో మోడల్ స్కూల్స్ విధానాన్ని ఏర్పాటు చేసారన్నారు. బాలికల విద్యకు ప్రాధాన్యతనిస్తూ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలును వైఎస్ఆర్ హయాంలో ఆ వ్యవస్థ మొదలై ఇప్పుడు ఆ వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.విద్యాసంస్థలను బలోపేతం చేయడంతో పాటు, బాలికలు చదువు మధ్యలోనే ఆపకుండా ఉన్నత విద్యను కొనసాగించేలా ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు.
రాయచోటి పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాల నందు 3 వ తరగతి నుండి డిగ్రీ వరకూ ఒకే ప్రాంగణంలో విద్యా సౌకర్యాలు ఉండేలా చేసిన ఘనత అప్పటి జగన్ ప్రభుత్వానిదేనన్నారు. విద్యను వ్యాపారంగా మార్చకుండా, విద్యను హక్కుగా చేసి,అమ్మ ఒడి వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి, తద్వారా పేద కుటుంబాల పిల్లలు చదువుకు దూరం కాకుండా ప్రోత్సహించే ప్రయత్నం జరిగిందన్నారు. విద్యను వ్యాపారంగా కాకుండా ప్రతి పేద కుటుంబానికి అందాల్సిన హక్కుగా చూడాలన్నదే గత ప్రభుత్వ విధానమన్నారు.
ధనవంతుల పిల్లలు కార్పోరేట్ పాఠశాలల్లో ఎలాంటి సౌకర్యాలతో చదువుతున్నారో,అదే స్థాయి వసతులు పేద పిల్లలకు ప్రభుత్వ పాటశాలల్లో అందుబాటులో ఉండాలన్నదే జగన్ ప్రభుత్వ కల అని ఆయన పేర్కొన్నారు. ఆత్మగౌరవానికి సంబందించి పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ తో కూడిన టాయిలెట్లు ను ఏర్పాటు చేసిందన్నారు.
పరిశుద్ధమైన త్రాగునీటి కోసం వాటర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వం పాఠశాల ప్రారంభ సమయంలోనే పుస్తకాలు,యూనిఫారం లను అందించేదని, కానీ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బ్యాగులు, సమయానికి అందని యూనిఫాంలు, పుస్తకాల పంపిణీలో జాప్యం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని విమర్శించారు.
పెండింగ్‌లో ఉన్న ఐదు శాతం,పది శాతం పెండింగ్ లో ఉన్న నాడు–నేడు పనులను పూర్తి చేసి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ విద్యావ్యవస్థను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఇప్పుడు ఉద్యమం చేపడుతున్నారన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిని తెలియ పరుస్తున్నామన్నారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులు, ఫర్నిచర్, డిజిటల్ బోర్డులు, తరగతి గదులు మరియు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటోలు ఈ మార్పుకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయన్నారు.
రాయచోటి మున్సిపాలిటీవి మాత్రమే కాకుండా, ప్రతి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో జరిగిన అభివృద్ధి పనులను ఫోటోల ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తామన్నారు.
పేద పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, గతంలో జరిగిన మంచి పనులను కొనసాగిస్తూ, మిగిలిన పనులను పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.




