Rayachoty: రాయచోటిలో 'జగన్ 2.o' యాప్ పోస్టర్ ఆవిష్కరణ
Rayachoty: డిజిటల్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రూపొందించిన 'జగన్ 2.o' యాప్ పోస్టర్‌ను రాయచోటిలో ఘనంగా ఆవిష్కరించారు.
Rayachoty: రాయచోటిలో 'జగన్ 2.o' యాప్ పోస్టర్ ఆవిష్కరణ
Rayachoty: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని డిజిటల్ వేదికపై మరింత బలోపేతం చేస్తూ, పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ విధానాలు, ప్రజా సమస్యలను వేగవంతంగా ప్రజలకు చేరవేసే లక్ష్యంతో రూపొందించిన జగన్ 2.౦ యాప్ పోస్టర్ ను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాయచోటి వైఎస్సార్‌సీపీ కార్యాలయం లో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మాజీ వైస్ ఛైర్మన్ ఫయాజుర్ రెహమాన్, వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, పట్టణ కన్వీనర్ నవాజ్ తదితర నాయకులు మాట్లాడుతూ, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పార్టీ కార్యకర్తలు కూడా డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ 2.o యాప్ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ కార్యక్రమాలు, నాయకత్వం చేపట్టే కార్యక్రమాల సమాచారాన్ని క్షణాల్లో కార్యకర్తలు, ప్రజలకు చేరవేయవచ్చని తెలిపారు.
ప్రతి కార్యకర్త ఈ యాప్‌ను తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని విస్తృతంగా వినియోగించాలని, ప్రజలకు కూడా పరిచయం చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతను ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తూ పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో జగన్ 2.o కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యాప్‌ను ఆవిష్కరించారు. పార్టీ బలోపేతానికి ఈ యాప్ ఒక శక్తివంతమైన డిజిటల్ వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తూ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కొలిమి ఛాన్ బాష,ఫయాజ్ అహమ్మద్, గౌస్ ఖాన్, సుగవాసి శ్యామ్, అన్నా సలీం,ఆనంద రెడ్డి, వైఎస్ఆర్ సిపి మున్సిపాలిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి రియాజుర్ రెహమాన్, ఖళీళ్,జిల్లా మైనారిటీ కార్యదర్శి సైదియా నియాజ్, ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప, సగినాల శివ శంకర్, గోపాల్ రెడ్డి,వీరణాగన్న, అమీర్, పట్టణ ఉపాధ్యక్షుడు నాగేంద్ర, హజరత్ ఖాదర్ వలీ, అనిల్, యూసుఫ్ ఖాన్, బేపారి జబీఉల్లా, ఇనాముల్లా, బేపారి అసద్,రౌఫ్, ఆప్ఝల్, హసనుల్లా,ఆర్షద్ అహమ్మద్, యూనుస్,నూర్, హాజర్, రియాజుర్, కార్యకర్తలు పాల్గొని యాప్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.




