Sambepalli: సంబేపల్లెలో కుటుంబ సభ్యులను పరామర్శించిన నేత!

Sambepalli: సంబేపల్లెకు చెందిన కువైట్ కృష్ణారెడ్డి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంతాపం తెలిపి, నివాళులర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Oct 2026 3:45 PM IST
Sambepalli
X

Sambepalli: సంబేపల్లెలో కుటుంబ సభ్యులను పరామర్శించిన నేత!

Sambepalli: సంబేపల్లెమండలంలోని సంబేపల్లెకు చెందిన కువైట్ కృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి బుధవారం సంబేపల్లెలోని ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

కృష్ణారెడ్డి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ రాష్ట్ర కార్యదర్శి గొర్ల ఉపేంద్రారెడ్డి, మండల నాయకులు వీవీ ప్రతాప్‌రెడ్డి, మాజీ సర్పంచ్ లు అంచల రామచంద్ర, వెంకట రమణ నాయక్, నాయకులు వాయల్పాటి ఆనంద కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI