Annamayya: కరెంట్ షాక్ బాధితుడికి సబ్ కలెక్టర్ భరోసా!
Annamayya: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన బాధిత యువకుడు కరుణాకర్‌కు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి భరోసా ఇచ్చారు
Annamayya: కరెంట్ షాక్ బాధితుడికి సబ్ కలెక్టర్ భరోసా!
మదనపల్లె, జూన్ 29: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం చీకులబైలు గ్రామానికి చెందిన కరుణాకర్ (17) గత ఏడాది డిసెంబర్ 19న చర్చిలో లైట్లు ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.
అప్పటి నుంచి వైద్య చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి బాధితుడి సమస్యను సానుకూలంగా పరిశీలించి, అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, అర్హత మేరకు దివ్యాంగ పెన్షన్ మంజూరు అయ్యేలా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
దీంతో బాధిత కుటుంబ సభ్యులు సబ్ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు




