Rayachoti: రాయచోటి ప్రసన్నాంజనేయ ఆలయంలో శ్రావణ శనివారం అన్నదానం

Rayachoti: రాయచోటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ శనివారం వేడుకలు. అన్నదానంలో పాల్గొన్న టీటీడీ మాజీ బోర్డు మెంబర్ సుగవాసి ప్రసాద్ బాబు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 16 Aug 2026 6:26 AM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి ప్రసన్నాంజనేయ ఆలయంలో శ్రావణ శనివారం అన్నదానం

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి గాలివీడు రోడ్డులోని పవిత్ర శ్రావణమాసం తొలి శనివారం సందర్భంగా మాండవ్య నది ఒడ్డున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

టీడీపీ నాయకులు మన్నేరు రామాంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ మాజీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ “అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం భగవంతునికి నైవేద్యం సమర్పించినట్లే” అన్నారు. శ్రావణమాసంలో ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు భక్తిభావాన్ని, సేవాస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story