Rayachoti: రాయచోటిలో ముత్తూట్ మనీ నూతన బ్రాంచ్ ప్రారంభం!

Rayachoti: రాయచోటి మాసపేటలో ముత్తూట్ మనీ నూతన బ్రాంచ్ ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన టీడీపీ నేత సుగవాసి ప్రసాద్ బాబు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 4 Sept 2026 12:35 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో ముత్తూట్ మనీ నూతన బ్రాంచ్ ప్రారంభం!

Rayachoti: రాయచోటి పట్టణం మాసపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన Muthoot Money నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుగవాసి ప్రసాద్ బాబు గారికి Muthoot Money సిబ్బంది, నిర్వాహకులు, బిల్డింగ్ యజమాని మాదా రమేష్ బాబు గారు ఘనంగా స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం నూతన బ్రాంచ్ నిర్వహణ, అందించనున్న ఆర్థిక సేవల గురించి నిర్వాహకులు వివరించారు.

రాయచోటి పట్టణంలో నూతన వ్యాపార సంస్థలు, ఆర్థిక సేవా కేంద్రాలు ఏర్పాటవుతూ స్థానిక ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని సుగవాసి ప్రసాద్ బాబు గారు పేర్కొన్నారు.

నూతనంగా ప్రారంభమైన Muthoot Money బ్రాంచ్ మరింత అభివృద్ధి సాధించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో Muthoot Money ప్రతినిధులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నూతన బ్రాంచ్ యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story