Rayachoti: రాయచోటిలో వినాయక పూజలు, అన్నదానంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు!
Rayachoti: రాయచోటి పాత వాల్మీకి వీధిలో వినాయక ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొన్నారు.
Rayachoti: రాయచోటిలో వినాయక పూజలు, అన్నదానంలో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు!
Rayachoti: వినాయకుని వారోత్సవాల్లో భాగంగా రాయచోటి పట్టణం పాత రాయచోటిలోని వాల్మీకి వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు ముఖ్య అతిథిగా హాజరై విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు సుగవాసి ప్రసాద్ బాబు గారిని ఘనంగా సత్కరించారు. “అన్నదానం గొప్ప పుణ్య కార్యక్రమం” అని పేర్కొన్న ప్రసాద్ బాబు గారు, భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.




