Rayachoti: సిద్దవటం పాపులమ్మ భౌతిక కాయానికి సుగవాసి ప్రసాద్ బాబు నివాళులు!

Rayachoti: రాయచోటి కొత్తపేట తొగటవీధిలో మృతి చెందిన సిద్దవటం పాపులమ్మ భౌతిక కాయానికి రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు నివాళులర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 10 Oct 2026 10:53 AM IST
Rayachoti
X

Rayachoti: సిద్దవటం పాపులమ్మ భౌతిక కాయానికి సుగవాసి ప్రసాద్ బాబు నివాళులు!

Rayachoti: రాయచోటి పట్టణం కొత్తపేటలోని తొగటవీధిలో నివాసముంటున్న సిద్దవటం సురేష్ గారి తల్లి సిద్దవటం పాపులమ్మ గారు మృతి చెందిన విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాయచోటి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు వారి స్వగృహానికి వెళ్లి పాపులమ్మ గారి భౌతిక కాయానికి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, సిద్దవటం పాపులమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

సిద్దవటం పాపులమ్మ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని తట్టుకునే శక్తిని, మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI