Rayachoti: సుగవాసి కుటుంబ సభ్యులను పరామర్శించిన మౌర్యా రెడ్డి!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని మాసాపేటలో దివంగత సుగవాసి సుభద్రమ్మ ప్రథమ వర్ధంతి कार्यक्रमం జరిగింది.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 July 2026 7:07 PM IST
Rayachoti
X

Rayachoti: సుగవాసి కుటుంబ సభ్యులను పరామర్శించిన మౌర్యా రెడ్డి!

రాయచోటి: సుగవాసి సుభద్రమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన మంత్రి మండిపల్లి మేనల్లుడు మౌర్యా రెడ్డి, మంత్రి తనయుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గారు.

రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని మాసాపేటకు చెందిన సుగవాసి అనునా తల్లిగారు, దివంగత సుగవాసి సుభద్రమ్మ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు మౌర్యా రెడ్డి మరియు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దివంగత సుగవాసి సుభద్రమ్మ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సుభద్రమ్మ గారి సేవా భావాన్ని స్మరించుకుంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు మరియు పాల్గొని దివంగత సుగవాసి సుభద్రమ్మ గారికి ఘన నివాళులు అర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story