Sundupalli: విద్యార్థిపై హిందీ ఉపాధ్యాయురాలి దారుణ దాడి

Sundupalli: సుండుపల్లి లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో చిన్నారి విద్యార్థిపై ఉపాధ్యాయురాలి కిరాతకం. సెకండ్ క్లాస్ బాలుడి చేయి విరిగేలా కొట్టిన వైనం, తల్లిదండ్రుల ఆగ్రహం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 Sept 2026 11:32 PM IST
Sundupalli
X

Sundupalli: విద్యార్థిపై హిందీ ఉపాధ్యాయురాలి దారుణ దాడి

సుండుపల్లి: అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పరిధిలో ఉన్న లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతున్న మొహమ్మద్ అలీ పై హిందీ ఉపాధ్యాయురాలు అతి కిరాకంగా కొట్టి తీవ్ర గాయాలు పాలు చేసి ఉపాధ్యాయురాలు సెకండ్ క్లాస్ విద్యార్థి చెయ్యి విరిగేలాగా కొట్టడం ఏంటి అని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అతిగా ఫీజులు వసూలు చేస్తున్న కూడా అధికారులు పట్టించుకోవడం లేదు అయినప్పటికీ ఇలా చిన్న పిల్లల మీద దాడికి పాల్పడుతున్న ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI