BrahmamgariMatham: నిజాయితీ చాటుకున్న స్వీపర్ రాముడు!

BrahmamgariMatham: బ్రహ్మంగారిమఠంలో భక్తురాలు పోగొట్టుకున్న పర్సును తిరిగి అందజేసి నిజాయితీ చాటుకున్న స్వీపర్ రాముడు. మఠం యాజమాన్యం, భక్తుల అభినందనలు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 16 Aug 2026 11:54 AM IST
BrahmamgariMatham
X

BrahmamgariMatham: నిజాయితీ చాటుకున్న స్వీపర్ రాముడు!

BrahmamgariMatham: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ప్రాంగణంలో భక్తురాలు పోగొట్టుకున్న పర్సును గుర్తించి, మఠం యాజమాన్యానికి అప్పగించి తిరిగి అందజేసిన మఠం సిబ్బంది స్వీపర్ రాముడిని పలువురు అభినందించారు.

సూర్యాపేట జిల్లా కోదాడ గ్రామానికి చెందిన వీరాచారి భార్య సావిత్రమ్మ మఠం ప్రాంగణానికి వచ్చిన సందర్భంగా తన పర్సును పోగొట్టుకున్నారు. అందులో రూ.2,500 నగదు ఉన్నట్లు తెలిపారు. పర్సు మఠం ప్రాంగణంలో పనిచేస్తున్న స్వీపర్ రాముడికి దొరకడంతో వెంటనే మఠం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం పర్సులోని నగదును, పర్సును భక్తురాలు సావిత్రమ్మకు రాముడు తిరిగి అందజేశారు. తనకు దొరికిన సొమ్మును నిజాయితీగా యాజమాన్యానికి అప్పగించి, బాధితురాలికి తిరిగి అందజేసిన రాముడి నిజాయితీని మఠం సిబ్బంది, భక్తులు అభినందించారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story