Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూటమి చారిత్రాత్మక క్లీన్ స్వీప్!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూటమి క్లీన్ స్వీప్ సాధించింది. 44వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా ఇట్టే సునీల్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి ఏకగ్రీవమయ్యారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 26 Oct 2026 7:47 AM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూటమి చారిత్రాత్మక క్లీన్ స్వీప్!

Proddatur: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (కూటమి) సంచలన విజయం సాధించింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 52 మున్సిపల్ వార్డులలో కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నికై, కూటమి క్లీన్ స్వీప్ నమోదు చేసింది.

​ఇందులో భాగంగా 44వ వార్డ్ ఇట్టే. సునీల్ కుమార్ కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి ఆయన తన ఎన్నికల డిక్లరేషన్ పత్రాన్ని అందుకున్నారు. ​

ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్‌గా నంద్యాల రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మునిసిపల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా ఆయన అధికారిక డిక్లరేషన్ స్వీకరించారు. ​ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అభినందనలు తెలిపారు..

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR