Rayachoty: దప్పేపల్లి గ్రామంలో గ్రాండ్ గా టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం

Rayachoty: దప్పేపల్లి గ్రామంలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం. సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన మండల అధ్యక్షుడు యనమల మదన్ మోహన్.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 17 Aug 2026 2:56 PM IST
Rayachoty
X

Rayachoty: దప్పేపల్లి గ్రామంలో గ్రాండ్ గా టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం

Rayachoty: లక్కీరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామం గొల్లపల్లిలో డోర్ టు డోర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన మండల టిడిపి అధ్యక్షుడు యనమల మదన్మోహన్. గ్రామ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ తెలుగుదేశం ప్రభుత్వం గత రెండు సంవత్సరాల లో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన మండల అధ్యక్షుడు యనమల మదన్ మోహన్.

ప్రతి పల్లెలోని ప్రజలతో మమేకమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు వారి సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చిన యనమల మదన్మోహన్.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అంబా బత్తిన రెడ్డయ్య , మద్దిరేవుల సింగిల్ విండో అధ్యక్షుడు బత్తిన దేవేందర్ రెడ్డి , గంగమ్మ ఆలయ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు యాదవ్ గా, మాజీ సర్పంచులు , మాజీ ఎంపీటీసీలు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story