Rayachoti: టీడీపీ నేత వసంత్ కుమార్ భౌతికకాయానికి డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నివాళి!

Rayachoti: చిత్తూరు టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్ చెరుకూరి వసంత్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నివాళులర్పించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 25 Aug 2026 11:20 PM IST
Rayachoti
X

Rayachoti: టీడీపీ నేత వసంత్ కుమార్ భౌతికకాయానికి డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి నివాళి!

రాయచోటి: చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సైనికుడు, మాజీ కార్పొరేటర్, చిత్తూరు టౌన్ టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వసంత్ కుమార్ గుండెపోటుతో మృతి చెందడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వసంత్ కుమార్ గారి భౌతికకాయాన్ని సందర్శించిన డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ.. “తమ్ముడు వసంత్ కుమార్ గారి సేవలను స్మరిస్తూ నివాళులర్పిస్తున్నాను. ఎంతో భవిష్యత్తు ఉన్న పసుపు సైనికుడిని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. పార్టీ కోసం వసంత్ కుమార్ గారు చేసిన సేవలు, కార్యకర్తగా ఆయన అందించిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని అన్నారు. వసంత్ కుమార్ గారి మృతి పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story