Rayachoti: వైసీపీ ప్రభుత్వంలో పేరుకే కాలనీలు అభివృద్ధి శూన్యం!
Rayachoti: వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయచోటిలోని కాలనీలలో అభివృద్ధి శూన్యమని, ప్రస్తుత మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని విమర్శించిన టీడీపీ నేత.
Rayachoti: వైసీపీ ప్రభుత్వంలో పేరుకే కాలనీలు అభివృద్ధి శూన్యం!
Rayachoti: రాయచోటిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ సంబేపల్లి మండలం క్లస్టర్ ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ వైసిపి ప్రభుత్యంలో " పేరుకే కాలనీలు -అభివృద్ధిలో శూన్యమని" విమర్శించారు. గత వైసిపి ప్రభుత్వం కనీసం గుంతలను కూడా పూడ్చ కుండా, కనీస రహదారి సౌకర్యం కూడా లేకుండా, నీటి సౌకర్యాలు లేకుండా లేఔట్లను వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు.
కానీ మన మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గుడి, బడి, వైద్యం, విద్య, త్రాగునీటి విషయాలలో రాజకీయాలకు తావు లేకుండా, అభివృద్ధి విషయంలో ప్రజలందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.
గత వైసిపి ప్రభుత్వం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో తిరుపతి నాయుడు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాయుడు కాలనీ, ఎన్జీవో కాలనీ, లక్ష్మీపురం కాలనీలలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఇప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు కాలనీలలో సిమెంటు రోడ్డులను, డ్రైనేజీలను వేయిస్తూ కాలనీల అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.




