Rayachoti: ఉపాధ్యాయులను రాజకీయాల్లోకి లాగడం దారుణం!
Rayachoti: రాయచోటి టీడీపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ మీడియా సమావేశం. ఉపాధ్యాయులను రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు.
Rayachoti: ఉపాధ్యాయులను రాజకీయాల్లోకి లాగడం దారుణం!
Rayachoti: రాయచోటి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాయచోటి రూరల్ మండల అధ్యక్షులు గండికోట సుధాకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను రాజకీయాల్లోకి లాగడం దారుణమన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు ఉపాధ్యాయులే వివిధ ప్రాంతాల్లో స్పందించారని సుధాకర్ తెలిపారు.
కర్నూలు కొండారెడ్డి బురుజు, విజయవాడలో అంబేద్కర్ విగ్రహం, విశాఖ సముద్ర తీరం వద్ద తమ ఉద్యోగాలు తమ కష్టార్జితం అని ఉపాధ్యాయులు స్పష్టం చేశారని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల గంజాయి, డ్రగ్స్ మత్తులో బరితెగించిన అల్లరి మూకలు దాడులకు తెగబడుతుంటే, టీచర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యార్థులకు విద్యను బోధిస్తున్నారు అని తెలిపారు.
అలాంటి ఉపాధ్యాయులను సైతం గత వైసిపి ప్రభుత్వం కరోనా సమయంలో బ్రాందీ షాపుల వద్ద నిలబెట్టిన ఘనత కూడా వారికే దక్కుతుందన్నారు. ప్రతి నిజాన్ని అబద్ధం అని చెప్పి, అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తున్న వైసీపీ పార్టీకి యావత్ రాష్ట్ర ఉపాధ్యాయులందరూ బుద్ధి చెప్పే రోజు దగ్గరపడిందని హెచ్చరించారు.
తమ గౌరవానికి భంగం కలిగించ వద్దంటూ ఉపాధ్యాయులు సమావేశాలు, నిరసనలు చేపట్టాల్సి రావడం మన రాష్ట్ర దౌర్భాగ్యం అని ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి కోటకొండ రవి శంకర్ పాల్గొన్నారు.




