Rayachoti: రాయచోటిలో విషాదం: అశోక్ మృతికి మౌర్యా రెడ్డి నివాళి!

Rayachoti: రాయచోటిలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ అభిమాని అశోక్ భౌతికకాయానికి మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి నివాళులర్పించి, కుటుంబానికి భరోసానిచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Aug 2026 7:20 AM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో విషాదం: అశోక్ మృతికి మౌర్యా రెడ్డి నివాళి!

Rayachoti: రాయచోటిలో మండిపల్లి కుటుంబానికి ఎంతో నమ్మకమైన అభిమానిగా, సేవకుడిగా ఉన్న నడిమిపల్లి అశోక్ రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం పట్ల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.

అశోక్ భౌతికకాయాన్ని సందర్శించిన మౌర్యా రెడ్డి గారు, పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మౌర్యా రెడ్డి గారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అశోక్ మమ్మల్ని విడిచి వెళ్లడం నమ్మలేకపోతున్నాం.

ఇది మా కుటుంబానికి తీరని లోటు. మండిపల్లి కుటుంబం అంటే ఎంతో అభిమానం, నమ్మకంతో పనిచేసిన వ్యక్తి అశోక్. అతను ఒక సేవకుడిలా కాదు, ఒక నమ్మకమైన వ్యక్తి లాగా పని చేశాడని . అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అశోక్ కుటుంబానికి మండిపల్లి కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story