Proddatur: వేడెక్కిన రాజకీయం గెలిచిన వాళ్లను సమాధి చేస్తారా?
Proddatur: ప్రొద్దుటూరులో రాచమల్లు వ్యాఖ్యలపై టీడీపీ నేత నంద్యాల కొండారెడ్డి ఫైర్. రాచమల్లు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Proddatur: వేడెక్కిన రాజకీయం గెలిచిన వాళ్లను సమాధి చేస్తారా?
Proddatur: వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు ప్రొద్దుటూరు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాచమల్లు నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ నాయకుడు నంద్యాల కొండారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో పరాభవం, ప్రజల సహకారం లేకపోవడంతోనే ఆయన అహంకారపూరిత భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఎన్నికలను ఫేస్ చేయడానికి భయపడే రాచమల్లు నామినేషన్ ప్రక్రియకు దూరంగా ఉన్నారని, ఆయన తన భార్యతో నామినేషన్ ఉపసంహరణ చేయించడంపై కుటుంబ రాజకీయ విమర్శలు గుప్పించారు. గెలిచిన వాళ్లను సమాధులు చేస్తానని రాచమల్లు హెచ్చరించడంపై స్పందిస్తూ... దానికి మాకు అధికారంతో పనిలేదని, ఆ దమ్ము, ఆత్మగౌరవం మాకు ఉన్నాయని స్పష్టం చేశారు.
ప్రొద్దుటూరులో ప్రశాంత వాతావరణం ఉండాలని తాము కోరుకుంటున్నామని, అయితే ఇదే పద్ధతి కొనసాగిస్తే మాత్రం తాము చేయాల్సింది చేస్తామని హెచ్చరించారు. తాము ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందించే దిశగా ముందుకు వెళ్తుంటే... రాచమల్లు మాత్రం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని నంద్యాల కొండారెడ్డి ధ్వజమెత్తారు.




