Rayachoti: రాయుడు కాలనీలో టీడీపీ యువనేత నిశ్చల్ నాగిరెడ్డి పర్యటన!
Rayachoti: రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని టీడీపీ యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.
Rayachoti: రాయుడు కాలనీలో టీడీపీ యువనేత నిశ్చల్ నాగిరెడ్డి పర్యటన!
Rayachoti: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందజేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. రాయుడు కాలనీకి చెందిన స్థానిక టీడీపీ నాయకులు రంజిత్ రాయల్ తో కలిసి కాలనీలో 'డోర్ టు డోర్' కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం నిశ్చల్ నాగిరెడ్డి మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. అర్హత ఉండి ఇంకా పెన్షన్ రాని వారికి త్వరలోనే నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. రాయుడు కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, ఇతర స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని, ఇక్కడ ఉన్న ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంకల్పం
గత రెండేళ్ల పాలనలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని కొనియాడారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామని వివరించారు.ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి కోరారు.
ఈ 'డోర్ టు డోర్' కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు శెట్టిపల్లి నాగరాజ,బొమ్మిశెట్టి రామచంద్ర,సుధాకర్, సుహెల్, ఇర్ఫాన్, రాయుడు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




