Proddatur: టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెదిరింపు లేఖ

Proddatur: ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి చంపుతామంటూ స్పీడ్ పోస్ట్ ద్వారా బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 5 Jun 2026 3:57 PM IST
Proddatur
X

Proddatur: టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డికి బెదిరింపు లేఖ

Proddatur: ప్రొద్దుటూరు టిడిపి మాజీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చంపుతామని స్పీడ్ పోస్టు ద్వారా తన ఇంటికి బెదిరింపు లేఖ పంపారని తెలిపారు. ఇంట్లో ఉండగానే చంపేస్తామని లేఖలో ప్రస్తావించారన్నారు. మా తాత పెద్ద వీరారెడ్డిని చంపినట్టు చంపుతామని లేక ద్వారా బెదిరించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.

నా జోలికి వచ్చిన నా మీద ఒక కత్తి దెబ్బ తగిలిన చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. టౌన్ బ్యాంకు ఎస్ఎస్ మాల్ వ్యవహారంపై మాట్లాడకూడదని ఈ లేఖలో ప్రస్తావించారు. పంపిన వారు ధైర్యంగా బయటికి రావాలన్నారు. ఈ వ్యవహారం పై పోలీసులకు ఫిర్యాదు చేశానని...త్వరలోనే అన్ని విషయాలు బయటికొస్తాయన్నారు. ప్రజల పక్షాన నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని ప్రవీణ్ స్పష్టం చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story