Kadapa: కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవానికి టీడీపీ నేత ఆహ్వానం
Kadapa: కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవానికి రాయచోటి టీడీపీ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబును ముస్లిం సోదరులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
Kadapa: కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవానికి టీడీపీ నేత ఆహ్వానం
రాయచోటి, అన్నమయ్య జిల్లా
కడప: ఆమీన్ పీర్ పెద్ద దర్గా గంధం, ఉరుసు మహోత్సవానికి ఆహ్వానం
కడప ఆమీన్ పీర్ పెద్ద దర్గా గంధం మరియు ఉరుసు మహోత్సవాలకు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు, రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారికి ఆహ్వానం అందజేశారు.
రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం కడప ఆమీన్ పీర్ దర్గా పీఠాధిపతుల శిష్య బృందం, ముస్లిం సోదరులు ప్రసాద్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, గంధం మరియు ఉరుసు మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
13-08-2026 నుండి 14-08-2026 వరకు నిర్వహించనున్న ఈ పవిత్ర గంధం, ఉరుసు మహోత్సవానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతుల తరఫున ముస్లిం సోదరులు ప్రసాద్ బాబు గారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ, కడప ఆమీన్ పీర్ పెద్ద దర్గా గంధం, ఉరుసు మహోత్సవం సోదరభావం, ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవం, స్నేహభావంతో కలిసి మెలిసి ఉండాలని ఆకాంక్షించారు.




