Veerapalli: కడప జిల్లాలో టీడీపీ నాయకులకు చేదు అనుభవం!

Veerapalli: కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళలో తాగునీటి సమస్యపై టీడీపీ నాయకులను మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 29 July 2026 12:44 PM IST
Veerapalli
X

Veerapalli: కడప జిల్లాలో టీడీపీ నాయకులకు చేదు అనుభవం!

Veerapalli: కడప జిల్లా వీరబల్లి మండలం వంగిమళ్ళ గ్రామం ఆమూరివాండ్లపల్లె లో టిడిపి నాయకులకు గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. టిడిపి చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ఆమూరివాండ్లపల్లి కు వెళ్లిన గ్రామ టిడిపి నాయకులను మహిళలు నిలదీశారు. తాము నెల రోజుల నుంచి తాగునీటి సమస్యతో బాధపడుతున్నా ఏఒక్క అధికారి కానీ, నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందు తాగునీటి సమస్య తీర్చి మళ్లీ తమ గ్రామంలో అడుగుపెట్టండి అంటూ టిడిపి నాయకుల పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిష్కరించారు. టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వాళ్లంటే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తాగునీరు, పారిశుధ్యం లోపాలు, వీధి దీపాలు సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు పట్టుపడున్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story