Rayachoti: అల్లూరి సీతారామరాజుకు టీడీపీ శ్రేణుల ఘన నివాళి!
Rayachoti: రాయచోటిలో అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి వేడుకలు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కార్యాలయంలో టీడీపీ యువ నాయకుడు మిన్నం రెడ్డి మౌర్యా రెడ్డి.
Rayachoti: అల్లూరి సీతారామరాజుకు టీడీపీ శ్రేణుల ఘన నివాళి!
రాయచోటి: మన్యం వీరుడు, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు101వ వర్ధంతి సందర్భంగా రాయచోటిలోని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. అల్లూరి చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి , టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి మాట్లాడుతూ అల్లూరిని కొనియాడారు. "27 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తెలుగు పులి అల్లూరి. 'వంగి బతకడం కంటే ఎదురొడ్డి చావడం మేలు' అని నిరూపించిన మన్యం దొర ఆయన. అన్యాయంపై తిరగబడే ఆ స్ఫూర్తే తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టు" అని అన్నారు.
"అన్న ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపిస్తే, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమాన్ని జోడించారు. ఇప్పుడు నారా లోకేష్ గారి యువగళంతో, మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో అదే పోరాట పటిమను కొనసాగిస్తున్నాం. అల్లూరి చూపిన తెగువ, టీడీపీ ఆచరిస్తున్న ప్రజాసేవ ఒక్కటే - అది ప్రజల కోసం నిలబడటం" అని మౌర్య రెడ్డి పేర్కొన్నారు. "ప్రజల హక్కుల కోసం ప్రాణాలర్పించిన అల్లూరి ఆశయ సాధనకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
గిరిజన ప్రాంతాల అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే అల్లూరికి మనం ఇచ్చే నిజమైన నివాళి" అని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. Tdp నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని "జోహార్ అల్లూరి సీతారామరాజు" అంటూ నినాదాలు చేశారు.




