Badvel: బద్వేలు నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో మహానాడు వేడుకలు

Badvel: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో 2026 మహానాడు వేడుకలకు సర్వం సిద్ధం.

B. ARUN KUMAR, BADVEL
Published on: 26 May 2026 4:12 PM IST
Badvel
X

Badvel: బద్వేలు నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో మహానాడు వేడుకలు

బద్వేల్: గౌరవనీయులైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ నారా లోకేష్ గారు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 2026 మహానాడు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో బద్వేలు నియోజకవర్గం నందు శ్రీ మంచూరు సూర్య నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

బద్వేలు నియోజకవర్గం లో వున్న 12 క్లస్టర్స్ నందు శ్రీ మంచూరు సూర్య నారాయణ రెడ్డి గారి పర్యవేక్షణ లో అన్ని ఏర్పాట్లు జరిగాయి. కావున బద్వేలు నియోజకవర్గం లోని క్లస్టర్స్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ కమిటి సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, సభ్యులు, పార్టీ పదవుల్లో రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు వున్న నాయకులు, డైరెక్టర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు అందరు మీ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని అందరిని కోరుతున్నాము.

బద్వేలు నియోజకవర్గం లో అధిష్టానం ఆదేశాను మేరకు శ్రీ మంచూరు సూర్య నారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరు పాల్గొనాలని పిలుపునిస్తున్నాము. మహానాడు కార్యక్రమాన్ని బద్వేలు నియోజకవర్గం లో విజయవంతం చెయ్యాలని తెలుగుదేశం కార్యకర్తలు అందరిని కోరుతున్నాము.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story