Rajampet: ఉప్పరపల్లి ఘోర ప్రమాద బాధితులకు నివాళి!
Rajampet: టి.సుండుపల్లి మండలం ఉప్పరపల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన జయరాం, రవీంద్రల కుటుంబాలను రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు ప్రసాద్ బాబు పరామర్శించారు.
Rajampet: ఉప్పరపల్లి ఘోర ప్రమాద బాధితులకు నివాళి!
రాజంపేట: ఈ నేపథ్యంలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు, రాష్ట్ర టీడీపీ నాయకులు చప్పిడి మహేష్ నాయుడుతో కలసి మృతుల స్వగ్రామానికి వెళ్లి వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు . ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని కోల్పోవద్దని, కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజల ప్రాణ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రజల కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజల వెన్నంటి నిలుస్తుందని మరోసారి స్పష్టం చేశారు.




